News July 11, 2024
కృషి విజ్ఞాన కేంద్రంలో నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులు

గుంటూరు లాంఫామ్ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో గ్రామీణ యువతకు ఆరురోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేవీకే ప్రధాన శాస్త్ర వేత్త డాక్టర్ ఎం.యుగంధర్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15 నుంచి 20వ తేదీవరకు ఆరు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో వానపాముల నుంచి ఎరువు తయారీపై శిక్షణ ఉంటుందన్నారు.
Similar News
News February 15, 2025
గుంటూరు GGHలో విద్యార్థినులకు లైంగిక వేధింపులు

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చాయి. ల్యాబ్ టెక్నీషియన్లుగా శిక్షణ పొందుతున్న విద్యార్థినులపై బ్లడ్ బ్యాంకు ఉద్యోగి ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణ ఆసుపత్రిలో కలకలం రేపింది. ఈ మేరకు బాధిత విద్యార్థినులు వారి ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేశారు. దీంతో లైంగిక వేధింపుల ఘటన పై విచారణ చేపట్టాలని ముగ్గురు అధికారులతో ఒక కమిటీని ప్రిన్సిపాల్ ఏర్పాటు చేశారు.
News February 15, 2025
గిరిజనుల్లో పేదరికాన్ని రూపుమాపుతాం: సీఎం

సమగ్ర ప్రణాళికతో గిరిజనుల్లో పేదరికాన్ని నిర్మూలిస్తామని, గిరిజన చట్టాలను కాపాడతామని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా ఉండవల్లిలోని నివాసంలో సేవాలాల్‌కు నివాళులర్పించారు. సీఎం మాట్లాడుతూ.. గిరిజనులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఎన్టీఆర్ అనేక సంక్షేమాలు అమలు చేశారన్నారు. ఆయన స్పూర్తితో గిరిజనులకు రాజకీయ అవకాశాలు కల్పించి అండగా నిలిచామన్నారు.
News February 15, 2025
తాడికొండలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

తాడికొండ మండల పరిధిలోని బేజాత్ పురం గ్రామ పొలాల్లో గుర్తుతెలియని వృద్ధురాలి (70) మృతదేహం లభ్యమైంది. తాడికొండ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘటనా స్థలానికి ఎస్ఐ జైత్యా నాయక్ చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. వీఆర్వో రవిబాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. వృద్ధురాలి ఆచూకీ తెలిసినవారు తాడికొండ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.