News September 25, 2024
కృష్ణాజిల్లాలో 139 మంది వీఆర్ఓల బదిలీ
కృష్ణా జిల్లాలో భారీగా వీఆర్ఓల బదిలీలు జరిగాయి. ఉద్యోగుల బదిలీల్లో భాగంగా మొత్తం 139 వీఆర్ఓలను బదిలీ చేస్తూ కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో గ్రేడ్-1 వీఆర్ఓలు 77 మంది ఉండగా గ్రేడ్-2 వీఆర్ఓలు 62 మంది ఉన్నారు. వీరిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేశారు.
Similar News
News October 4, 2024
కోడూరు: కనకదుర్గమ్మకు వెండి కవచం బహుకరణ
కోడూరు మండలం నరసింహపురం రోడ్డులో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి వెండి కవచాన్ని బహుకరించారు. శుక్రవారం కోడూరు గ్రామానికి చెందిన పోతన ప్రసాద్ కుంటుంబ సభ్యులు రూ.1,01,116 విలువగల వెండి కవచం, చీర, సారే అమ్మవారికి బహుకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ ఛైర్మన్ రాంబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి కవచాన్ని అలంకరించారు.
News October 4, 2024
విజయవాడలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్
విజయవాడ నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన రామవరప్పాడు రింగ్-మహానాడు రోడ్డు వద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బెంగళూరులో ఇటీవల నిర్మించిన ఈ తరహా ఫ్లైఓవర్ మాదిరిగా 6.5కి.మీ. మేర మహానాడు రోడ్డు-నిడమానూరు వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ ఫ్లైఓవర్‌లో ఎలివేటెడ్ మెట్రో కారిడార్ సైతం నిర్మించనున్నట్లు సమాచారం.
News October 3, 2024
తిరువూరు: శావల దేవదత్‌కు శుభాకాంక్షల వెల్లువ
తిరువూరు నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జ్ టీడీపీ నేత శావల దేవదత్ గురువారం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని పున:ప్రారంభించారు. ఎమ్మెల్యే కొలికపూడి వివాదం నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ బాధ్యతలు దేవదత్‌కు అప్పగిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.