News February 21, 2025
కృష్ణాజిల్లా నేటి ముఖ్యాంశాలు

*కృష్ణా: డీజీపీకి లేఖ రాసిన పేర్ని నాని. *కృష్ణాజిల్లా పోలీసులను అభినందించిన హోంమంత్రి. *కృష్ణా జిల్లాలో మొదటి జీబీఎస్ కేసు. *అమలాపురం లాడ్జిలో పోరంకి డాక్టర్ మృతి. * ఉయ్యూరులో మద్యం మత్తులో వీరంగం. *కృష్ణా: APK ఫైల్ క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళి. *గన్నవరం: వంశీ కేసులో పిటిషన్ వాయిదా.
Similar News
News February 23, 2025
ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలి: కలెక్టర్

ప్రకృతి వ్యవసాయం వల్ల పొందే లాభాలపై రైతులకు అవగాహన కల్పించి వారిని ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై శనివారం అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలకు ఉన్న డిమాండ్ను రైతులకు తెలియజేయాలని సూచించారు.
News February 22, 2025
మత్స్యకారులు పథకాలు ఉపయోగించుకోవాలి: కలెక్టర్

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అమలవుతున్న పథకాలను కృష్ణా జిల్లాలోని మత్స్యకారులు, ఆక్వా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీ.కే.బాలాజి కోరారు. కలెక్టరేట్లో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సహకారంతో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజ పథకం వినియోగంపై శనివారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు ఇచ్చారు.
News February 22, 2025
పెనమలూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పెనమలూరు పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గంగూరు వద్ద శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి గాయాలతో పడి ఉన్నాడే. సమాచారం అందుకున్న పోలీసేులు అక్కడికి చేరుకొని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ చేశామన్నారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందినట్లు తెలిపారు. ఈ వ్యక్తి తెలిస్తే పెనమలూరు పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలన్నారు.