News February 21, 2025
కృష్ణాజిల్లా పోలీసులకు హోం మంత్రి అభినందనలు

కృష్ణాజిల్లా పోలీసులను హోం మంత్రి అనిత అభినందించారు. ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా ప్రశంసించారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం ముస్తాబాద్ బాలికలు అదృశ్యమైన ఘటనలో పోలీసుల స్పందించిన తీరును ఆమె మెచ్చుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు, సత్తెనపల్లి DSP, సీఐలకు ఫోన్ చేసి అభినందించినట్లు ఆమె Xలో పోస్ట్ చేశారు.
Similar News
News October 18, 2025
అభివృద్ధి పనుల బిల్లులను తక్షణం చెల్లించండి: కలెక్టర్

వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి చేసిన పనుల బిల్లుల చెల్లింపుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో వివిధ శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్ బిల్లుల చెల్లింపులపై సమీక్షించారు. పూర్తి చేసిన పనులకు సకాలంలో బిల్లులు రూపొందించి Onlineలో Uplod చేయాలని, కాంట్రాక్టర్లకు తుది బిల్లు చెల్లించేంత వరకు బాధ్యత వహించాలన్నారు.
News October 17, 2025
కృష్ణా: ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన కలెక్టర్ పలువురు ఉద్యోగుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఉద్యోగులు విన్నవించిన వివిధ సమస్యలను ఆయన ఓపిగ్గా ఆలకించి పరిష్కారంపై సంబంధిత అధికారులతో మాట్లాడారు.
News October 17, 2025
ప్రసూతి మరణాల నివారణకి చర్యలు: కలెక్టర్

ప్రసూతి మరణాలు సంభవించకుండా వైద్య ఆరోగ్య శాఖాధికారులు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం తన ఛాంబర్లో వైద్యాధికారులతో సమావేశమైన కలెక్టర్ ప్రసూతి మరణాలపై సమీక్షించారు. మాతృత్వ మరణాలను నివారించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. హైరిస్క్ ప్రెగ్నెంట్ కేసుల విషయంలో వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.