News September 5, 2024
కృష్ణాలో రేపు పాఠశాలలు యథాతథంగా పని చేస్తాయి: డీఈఓ
జిల్లాలో రేపు అన్ని యాజమాన్య పాఠశాలలు యథావిధిగా పని చేస్తాయని డీఈఓ తాహెరా సుల్తానా ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాలు ఉన్న పాఠశాలలకు మాత్రమే సెలవు ప్రకటించినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణ తేదీలు త్వరలో ప్రకటిస్తామన్నారు. అన్ని పాఠశాలల స్థితిగతులను పరిశీలించి, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను తరగతిలో కూర్చోబెట్టాలన్నారు.
Similar News
News September 14, 2024
ఈ నెల 18న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, ప్రభుత్వ శాఖలకు ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
News September 14, 2024
విజయవాడ: ధనుష్ సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తోంది
ధనుష్, శృతిహాసన్ జంటగా నటించిన ‘3’ (2012) సినిమా సెప్టెంబర్ 14న రీరిలీజ్ కానుంది. సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు విజయవాడలోని నాలుగు థియేటర్‌లలో ఈ సినిమా ప్రదర్శించనున్నారు. కాగా ఈ చిత్రంలోని “వై దిస్ కొలవెరి”తో పాటు ఇతర పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో విజయవాడలో ఈ సినిమా టికెట్లు ఆన్‌లైన్‌లో వేగంగా అమ్ముడవుతున్నాయి.
News September 14, 2024
కృష్ణా జిల్లా TODAY TOP NEWS
* విజయవాడలో బాడీ మసాజ్ సెంటర్‌పై పోలీసుల దాడి
* విజయవాడ రైల్వేస్టేషన్‌కు స్పెషల్ గుర్తింపు
* కృష్ణా జిల్లాలో కలకలం.. ఒకే ఇంట్లో 100పాములు
* ఇబ్రహీంపట్నంలో రోడ్డు ప్రమాదం(వీడియో)
* జోగి రమేశ్, అవినాశ్‌కు సుప్రీంలో ఊరట
* మంత్రి కొల్లు రవీంద్రకు HIGH COURTలో ఊరట
* ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ముంబై సినీ నటి