News August 26, 2024
కృష్ణాష్టమి ప్రజలందరి జీవితంలో శాంతిని నింపాలి: మంత్రి

భక్తితో నిండిన ఈ కృష్ణాష్టమి పర్వదినం మీ జీవితంలో ఆనందం, శాంతి నింపాలని ఆ శ్రీ కృష్ణుడి అనుగ్రహం రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమికి హిందూ సాంప్రదాయంలో ప్రాముఖ్యత ఉంటుందన్నారు.
Similar News
News September 12, 2025
ఆశించిన స్థాయిలో లేని చేప పిల్లల పెంపకం

నెల్లూరు జిల్లాలో సుమారు 78 సొసైటీలు, 110 పంచాయతీ చెరువులు ఉన్నాయి. సోమశిల రిజర్వాయర్ నిండడంతో కింది చెరువులకు ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు. అయితే చేప పిల్లల పెంపకం కేంద్రాలను గత పాలకులు నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం 20 లక్షల చేప పిల్లల లక్ష్యం సాధ్యం కాకపోతోంది. సోమశిల, పడుగుపాడు కేంద్రాలు మూతపడి భవనాలు శిథిలమయ్యాయి. ప్రస్తుతం కొద్దిపాటి తొట్టెల్లోనే పిల్లల పెంపకం జరుగుతోంది.
News September 12, 2025
నత్తనడకన రామాయపట్నం పోర్టు పనులు!

రామాయపట్నం పోర్ట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఏడాదికి 138 మిలియన్ టన్నుల కార్గో లక్ష్యంగా 19 బెర్తులతో కూడిన రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టారు. రూ.3,736 కోట్లతో 4 బెర్తుల తొలిదశ నిర్మాణ పనులకు 2022 జూన్‌లో అప్పటి CM జగన్ భూమిపూజ చేశారు. 2024 జనవరిలో తొలి కార్గో షిప్ వచ్చేలా అప్పట్లో పనులు చురుకుగా సాగాయి. ప్రభుత్వం మారడంతో 6 నెలల పాటు పనులు స్తంభించాయి.
News September 12, 2025
మిస్టరీగా కావలి మాజీ MLA జాడ?

మాజీ MLA రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నారన్నది కావలిలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హత్యాయత్నం కేసులో ఇరుక్కున్న వెంటనే ప్రతాప్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. బెంగళూరులో ఉండొచ్చని కొందరు.. కాదు కాదు ఆయన దేశం దాటి శ్రీలంక వెళ్లుంటారంటూ మరికొందరి ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. అయితే ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఆయన జాడ మిస్టరీగా మారింది.