News August 27, 2024

కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న వరంగల్ ఎంపీ

image

హనుమకొండలో యాదవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. ఎంపీ కావ్య మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చిన్నారులకు చిన్నతనం నుంచే నేర్పించాలన్నారు. అన్ని విషయాల్లో మనకు స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో విజయం సాధించవచ్చన్నారు.

Similar News

News September 12, 2024

ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎంల)ను భద్రపరిచిన గోదాములను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య గురువారం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాములను కలెక్టర్ పరిశీలించారు.

News September 12, 2024

భద్రకాళి ఆలయంలో రూ.1,05,000లకు వేలం టెండర్

image

వరంగల్ నగరంలోని భద్రకాళి ఆలయంలో 5నెలలు (1-4-2024 నుంచి 10-9-2024) వరకు భక్తులు అమ్మవారికి సమర్పించిన 65 క్వింటాళ్ల ఒడి బియ్యంను బుధవారం బహిరంగ వేలం నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ బహిరంగ వేలంలో ముగ్గురు పాటదారులు పాల్గొనగా రూ.1,05,000కు రమేశ్ హెచ్చు పాటదారుగా టెండర్ పొందారన్నారు. ఈ బహిరంగ వేలం దేవాదాయ శాఖ పరిశీలకుడు సంజీవరెడ్డి, ఈఓ శేషు భారతి, తదితరులున్నారన్నారు.

News September 12, 2024

ఏటూరునాగారంలో పులి సంచారం ఆవాస్తవం: రేంజర్ అబ్దుల్ రెహమాన్

image

ఏటూరునాగారంలో పులి సంచరిస్తుందని వస్తున్న వార్తలు అవాస్తవమని ఏటూరునాగారం రేంజర్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. రాంనగర్ సమీప పొలాల్లో ఓ రైతు గురువారం పులిని చూశానని చెప్పడంతో, అటవీశాఖ అధికారులు అక్కడికి వెళ్లి చూశారన్నారు. కానీ అక్కడ ఎటువంటి పులి ఆనవాళ్లు కనిపించలేదని తెలిపారు. సోషల్ మీడియాలో వదంతులు సృష్టించొద్దన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.