News June 28, 2024

కృష్ణా: అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి అనిత

image

రాష్ట్రంలో వర్షాలు, వరద ముంపు ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో 8 జిల్లాల కలెక్టర్లు, DROలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముంపు ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. అనంతరం ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్‌ను అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా అలర్ట్ సెంటర్ విధులను అక్కడి అధికారులు ఆమెకు వివరించారు.

Similar News

News September 20, 2024

విజయవాడకు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్..!

image

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో శుక్రవారం అరెస్టయిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు శనివారం విజయవాడకు తీసుకురానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం డెహ్రాడూన్‌లోని మూడో అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో విద్యాసాగర్‌ను ఏపీ పోలీసులు ప్రవేశపెట్టినట్లు తాజాగా సమాచారం వెలువడింది. డెహ్రాడూన్‌లో అరెస్టయిన విద్యాసాగర్‌ను ట్రాన్సిట్ వారెంట్‌పై పోలీసులు విజయవాడకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

News September 20, 2024

విజయవాడ: బెయిల్ కోసం కాంతిరాణా టాటా పిటిషన్

image

సస్పెన్షన్‌లో ఉన్న IPS అధికారి కాంతిరాణా టాటా ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారణ జరపనున్నట్లు సమాచారం. కాగా కాదంబరి జెత్వాని కేసులో రాష్ట్ర ప్రభుత్వం కాంతి రాణా టాటాను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

News September 20, 2024

ఈ నెల 30న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు

image

కొవ్వూరు-కడియం రైల్వే సెక్షన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున ఆ మార్గం గుండా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు విజయవాడ-విశాఖపట్నం మధ్య ప్రయాణించే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లను(నం.12718 &12717) ఈ నెల 30న రద్దు చేశామని రైల్వే అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.