News March 11, 2025
కృష్ణా: అనాధల సంరక్షణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

శిశు గృహాల్లో ఉంటున్న అనాధ పిల్లలను కారా (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) పోర్టల్ ద్వారా దత్తత తీసుకునేందుకు వీలుగా అందులో పిల్లల వివరాలను అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బాలల సంక్షేమ పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో జడ్పీ సీఈవో కన్నమ నాయుడు, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, డీఈఓ ఎం.జె రామారావు ఉన్నారు.
Similar News
News March 11, 2025
అవనిగడ్డ: రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించిన కలెక్టర్

అవనిగడ్డ గ్రామంలో రక్షిత మంచినీటి పథకాన్ని మంగళవారం సాయంత్రం కలెక్టర్ డీకే బాలాజీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్యాంక్‌ను శుభ్రపరచడం, క్లోరినేషన్ చేసిన తేదీలను సంబంధిత రిజిస్టర్లను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా క్రమం తప్పకుండా ట్యాంక్‌ను శుభ్రపరిచి ప్రజలకు మంచినీటిని అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ వారికి సూచించారు.
News March 11, 2025
నాగాయలంక: పనులను పునః ప్రారంభించిన కలెక్టర్, ఎమ్మెల్యే

నాగాయలంకలోని జలక్రీడల శిక్షణ కేంద్ర నిర్మాణ పనులను మంగళవారం కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌లు శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను పునః ప్రారంభించారు. సభలో కలెక్టర్ మాట్లాడుతూ.. జలక్రీడలపై నాగాయలంక అనువైన ప్రదేశమన్నారు. జాతీయ స్థాయి క్రీడాకారిణి నాగిడి గాయత్రి ఈ ప్రాంతం వాసి కావటంతో భవిష్యత్తులో నాగాయలంకకు దేశంలోనే గొప్ప ప్రఖ్యాతులు రానున్నాయని ఆశించారు.
News March 11, 2025
కృష్ణా: మత్స్య సంపద యూనిట్లు నెలకొల్పేందుకు చర్యలు

జిల్లాలో మత్స్య సంపద యూనిట్లు సజావుగా నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2020-21 సంవత్సరంలో మొదలై 2023-24 సంవత్సరంతో ముగుస్తోందన్నారు.