News June 19, 2024
కృష్ణా: అనుమానాస్పద స్థితిలో రైతు మృతి
పెడన మండలంలోని కొంకేపూడికి చెందిన రైతు శ్రీనివాసరావు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడు శ్రీనివాసరావుకి సుబ్బారావు, వెంకటేశ్వరరావుల మధ్య పొలం హక్కుల విషయమై విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో వీరి మధ్య వివాదం జరిగింది. మనస్తాపం చెందిన శ్రీనివాసరావు ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 11, 2024
విజయవాడ: పాడైన విద్యుత్ మీటర్ల స్థానంలో కొత్తవి..
విజయవాడలో వరదల కారణంగా విద్యుత్ శాఖకు కూడా బాగానే నష్టం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్, సెల్లర్లో ఉన్న విద్యుత్ మీటర్లు వరద నీటికి పాడయ్యాయి. పాడైన మీటర్ల స్థానంలో తాత్కాలికంగా కొత్త మీటర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 35 వేల మీటర్లను సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. నేటి నుంచి మీటర్లు పాడైన స్థానంలో కొత్త మీటర్లను ఉచితంగా ఏర్పాటు చేయనున్నారు.
News September 11, 2024
డీజేలకు నో పర్మిషన్: మచిలీపట్నం డీఎస్పీ
వినాయక నిమజ్జన ఊరేగింపులో DJలకు అనుమతి లేదని మచిలీపట్నం డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తెలిపారు. స్థానిక సిరి కళ్యాణ మండపంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమైన ఆయన.. నిమజ్జనం రోజు తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మద్యం తాగి నిమజ్జన ఊరేగింపుల్లో పాల్గొన్నా, ఎక్కడైనా అల్లర్లకు పాల్పడినా కమిటీ వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అందరూ సహకరించి, పండగను ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలన్నారు.
News September 10, 2024
రేపు విజయవాడ వరద ప్రాంతాల్లో పర్యటించనున్న మెగా హీరో
ఈ నెల 11న సినీ హీరో సాయి ధరమ్ తేజ్ విజయవాడలో పర్యటించనున్నారు. వరద బాధితులకు నిత్యావసర సరకులు, దుప్పట్లు, బట్టలు పంపిణీ చేయనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ఉదయం 11గంటలకు సింగ్‌నగర్‌లోని అమ్మసేవ ఆశ్రమాన్ని ఆయన సందర్శిస్తానని, అభిమానులు రావాలని కోరారు. ఇటీవల ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆయన చెరో రూ. 10 లక్షల చొప్పున విరాళం అందించిన విషయం తెలిసిందే.