News March 4, 2025

కృష్ణా: అప్పుడు వెనక్కి తగ్గారు.. ఇప్పుడు విజయం సాధించారు

image

గత అసెంబ్లీ ఎన్నికలలో తెనాలి నుంచి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేయాలని భావించారు. అయితే జనసేన పార్టీకి టికెట్ కేటాయించడంతో చంద్రబాబు ఆదేశాల మేరకు ఆలపాటి వెనక్కి తగ్గారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటిని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా గెలిచి తీరాలని కసితో ఆలపాటి MLC ఎన్నికలను సవాల్‌గా తీసుకొని పట్టభద్రుల మద్దతుతో అఖండ విజయం సాధించారు.

Similar News

News March 15, 2025

పది ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి: జడ్పీ ఛైర్‌పర్సన్

image

ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలవాలని కృష్ణాజిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక అధికారులకు సూచించారు. శనివారం జడ్పీ మీటింగ్ హాలులో 1 నుంచి 7 వరకు జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు చైర్ పర్సన్ ఆధ్వర్యంలో జరిగాయి. తొలుత జడ్పీ చైర్ పర్సన్ జడ్పీటీసీలు, జిల్లా అధికారులచే స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు.

News March 15, 2025

కృష్ణా: నేటి నుంచి ఒంటి పూట బడులు

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం నుంచి జిల్లాలో ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7:45నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5 వరకు ఉంటాయని పేర్కొన్నారు. 

News March 14, 2025

బాపులపాడులో రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

image

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం వద్ద చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

error: Content is protected !!