News June 16, 2024
కృష్ణా: ‘అమాత్యా.. జిల్లా వాసులను ఆదరించండి’
గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి పార్థసారథికి ఉమ్మడి జిల్లాలో ఆ శాఖలో పరిష్కరించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయి. గత ప్రభుత్వంలో లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల వద్ద కొన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేవు. టిడ్కో ఇళ్ల కేటాయింపులలోను అనేక సమస్యలున్నాయి. మంత్రి సారథి ఈ సమస్యలు పరిష్కరించి ఉమ్మడి జిల్లావాసులకు మేలు చేయాలని ప్రజానీకం ఆశిస్తున్నారు.
Similar News
News September 20, 2024
రుణాల రీషెడ్యూలింగ్ దరఖాస్తులు తక్షణ పరిష్కారం: కలెక్టర్
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజల నుంచి వస్తున్న రుణాల రీ షెడ్యూల్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలిపారు. పలు బ్యాంకుల అధికారులు, సబ్ కలెక్టరేట్‌లోని ఫెసిలిటేషన్ కేంద్రం ఈ విషయంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఒక్క రోజులోనే 615 ఖాతాలకు సంబంధించి రూ. 51.37 కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్ చేసినట్లు వెల్లడించారు.
News September 20, 2024
త్రోబాల్ ఉమ్మడి కృష్ణాజిల్లా జట్లు ఎంపిక
రాష్ట్ర స్థాయి త్రో బాల్ పోటీలకు ప్రాతినిథ్యం వహించే ఉమ్మడి కృష్ణాజిల్లా జట్టును ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా త్రో బాల్ సంఘం కార్యదర్శి సులోచన తెలిపారు. పురుషుల జట్టుకు రవివర్మ, ప్రమోద్, చరణ్‌తేజ్, చరణ్‌సాయి, యశ్వంత్, రాము, సాయిసంతోష్, రాజ్‌దీప్, జ్యోతివర్మ, అక్షయ్, సూర్య, వెంకటేష్, భాస్కర్, జోసఫ్, అఖిల్, మహిళల జట్టుకు శ్రావణి, జోషిత, సాయిదుర్గ, దక్షిణి, నీరజ, దుర్గ, రితిక ఎంపికైనట్లు చెప్పారు.
News September 20, 2024
విజయవంతంగా ముగిసిన టూరిజం కాన్‌క్లేవ్-2024
విజయవాడ నోవాటెల్ హోటల్‌లో జరిగిన “ఏపీ- వియత్నాం టూరిజం కాన్‌క్లేవ్- 2024” శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ సదస్సులో వియత్నాం తరపున ముఖ్య అతిథిగా హాజరైన హెచ్.ఈ.ఎంగ్యూయేన్‌కు రాష్ట్రంలోని పర్యాటక రంగ అంశాలను మంత్రి దుర్గేష్ వివరించారు. భవిష్యత్తులో ఏపీ- వియత్నాం మధ్య పర్యాటక, సాంస్కృతిక బదిలీకి మరింత బలం చేకూర్చే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని హాజరైన వియత్నాం ప్రతినిధులు హామీ ఇచ్చారు.