News January 16, 2025

కృష్ణా: అలర్ట్.. ఈనెల 17తో ముగియనున్న గడువు

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో అక్టోబర్ 2024లో నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షలకు(2023-24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈనెల 17లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించింది. 

Similar News

News March 2, 2026

కృష్ణా: మందుగుండు దుకాణాలపై పోలీసుల సోదాలు

image

కాకినాడలోని వేట్లపాలెంలో ఇటీవల సంభవించిన పేలుడు ఘటన నేపథ్యంలో కృష్ణాజిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఉన్న మందుగుండు సామగ్రి స్థావరాలు, పటాకుల దుకాణాలలో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తూ స్టాక్ వివరాలను సేకరిస్తున్నారు. నివాస ప్రాంతాల మధ్యలో అక్రమంగా మందుగుండు సామగ్రి నిల్వ ఉంచినట్లు సమాచారం అందిన చోట్ల ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు.

News March 1, 2026

రేపు కలెక్టరేట్‌లో ‘మీ కోసం’: కలెక్టర్

image

ఈనెల 2న సోమవారం కృష్ణా జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్‌లో ఉదయం 10:30 గంటల నుంచి ‘మీ-కోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా వచ్చి వినతులు సమర్పించాలన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 1, 2026

అడ్డంకులు అధిగమించి పరిశ్రమలు నెలకొల్పాలి: కలెక్టర్

image

జిల్లాలో మంజూరైన పరిశ్రమల యూనిట్లను సత్వరమే నెలకొల్పేందుకు ఎదురవుతున్న అడ్డంకులను వెంటనే తొలగించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పరిశ్రమల అధికారులు, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి మంజూరైన 230 పరిశ్రమల యూనిట్ల పురోగతిపై యూనిట్ల వారీగా సమీక్షించారు.