News January 10, 2025
కృష్ణా: అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కళాశాలల్లో బీఈడీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 3,4,5,6,7 తేదీలలో ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. టైం టేబుల్ పూర్తి వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.
Similar News
News January 11, 2025
వందేభారత్ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
విజయవాడ మీదుగా విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే వందే భారత్ సీటింగ్ సామర్ధ్యాన్ని పెంచామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు శనివారం నుంచి నం.20833,84 వందేభారత్ రైళ్లు 20 కోచ్‌లతో నడుస్తాయన్నారు. ప్రస్తుతం ఉన్న ఛైర్ కార్ కోచ్‌లను 14 నుంచి 18కి పెంచామని, తద్వారా 1,128గా ఉన్న ఈ రైళ్ల సీటింగ్ సామర్థ్యం 1,440కి చేరుకుంటుందని రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
News January 11, 2025
కృష్ణా: ప్రయాణికులకు గుడ్ న్యూస్
ప్రయాణికుల సౌలభ్యం మేరకు చర్లపల్లి(CHZ)-విశాఖపట్నం(VSKP) మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నం.08534 CHZ-VSKP రైలును ఈనెల 11,13,16,18 తేదీలలో, నం.08533 VSKP-CHZ రైలును ఈనెల 12,15,17న నడుపుతామని, ఈ రైళ్లలో అన్ రిజర్వ్‌డ్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. కాగా ఉమ్మడి జిల్లాలో విజయవాడలో మాత్రమే ఈ రైళ్లు ఆగుతాయి.
News January 11, 2025
కృష్ణా: ట్రాక్టర్లతో బరులు ధ్వంసం చేసిన పోలీసులు
కృష్ణా జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కోడి పందేల నిర్వహణకై ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేశామని కృష్ణా జిల్లా పోలీసులు శుక్రవారం తమ అధికారిక X ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బరులను రెవెన్యూ అధికారులతో కలసి ధ్వంసం చేశామన్నారు. శాంతియుత వాతావరణంలో సంక్రాంతి పండుగను జిల్లా వాసులు జరుపుకోవాలని పోలీస్ సిబ్బంది Xలో సూచించారు.