News September 27, 2024

కృష్ణా: ఆర్టీసీ బస్సు కింద పడి యువకుడి మృతి

image

కృష్ణా జిల్లా తాడిగడపలో బస్సును ఓవర్టేక్ చేయబోయి స్కిడ్ అయ్యి పడటంతో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు తాడిగడపకు చెందిన అశోక్(23)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 11, 2024

కైకలూరులో రికార్డ్ స్థాయిలో ధరలు.. KG రూ.400

image

కైకలూరులో రికార్డు స్థాయిలో వెల్లుల్లి ధర పలుకుతోంది. అటు NTR జిల్లాలో కూడా భారీగా పెరిగాయి. ఇప్పటికే ఉల్లి, టమాటాలు సెంచరీకి దగ్గరలో ఉండగా.. వాటికి వెల్లుల్లి తోడయింది. ప్రస్తుతం వెల్లుల్లి కిలో రూ.400 పలుకుతోందని వినియోగదారులు, వ్యాపారస్థులు చెబుతున్నారు. ఇప్పటికే పలు నిత్యావసర సరుకులు ప్రభుత్వం తక్కువ ధరలకు ఇచ్చే ఏర్పాట్లు చేయగా.. వాటిలో వెల్లుల్లిని చేర్చాలంటున్నారు.

News October 11, 2024

ఇంద్రకీలాద్రిపై మహిషాసుర మర్దినిగా అమ్మవారు

image

ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కొలిచిన వారికి కొంగుబంగారమై నిలుస్తూ భక్తుల కోరికలు నెరవేర్చే అమ్మవారిని నేడు దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేటి తెల్లవారుజాము నుంచే ఆలయ పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

News October 11, 2024

కృష్ణా: BBA పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో BBA కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 23 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 24 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.