News October 21, 2024
కృష్ణా: ‘ఆ ట్రైన్ వేళల్లో ఎలాంటి మార్పులు లేవు’

ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే నరసాపురం- నాగర్సోల్ (17231) ప్రయాణించే రైలు సమయాల్లో ఎలాంటి మార్పులు చేయట్లేదని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆదివారం ట్వీట్ చేసింది. కాగా నిన్న ఈ ట్రైన్ ప్రయాణించే సమయాల్లోమార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ చేసింది.
Similar News
News May 7, 2025
గన్నవరం విమానాశ్రయంలో మోదీ పర్యటనపై సమీక్ష

అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు, భద్రతా అంశాలపై గన్నవరం విమానశ్రయంలో ప్రభుత్వ విభాగాల అధికారులు, విమానశ్రయ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర నోడల్ అధికారి వీరపాండ్యన్, కలెక్టర్ డీ.కే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, S.P గంగాధర రావు, విమానశ్రయ డైరక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
News April 25, 2025
తేలప్రోలు: కోరమండల్ ఎక్స్ప్రెస్లో మంటలు

హౌరా-చెన్నై మధ్య నడిచే కోరమండల్ ఎక్స్ప్రెస్లో కార్గో బోగి రైల్వే చక్రాలు దగ్గర మంటలు చెలరేగాయి. శుక్రవారం ఉదయం తేలప్రోలు దగ్గర మంటలు రావడంతో లోకో పైలట్ అప్రమత్తమై ట్రైన్ను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తేలప్రోలు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. లోకో పైలట్ మంటలను ఆర్పి వేశారు.
News April 25, 2025
కృష్ణా: ఈ ప్రాంతాల ప్రజలు జాగ్రత్త.!

జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనున్నట్లు APSDMA తెలిపింది. శుక్రవారం ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే ప్రాంతాలను వెల్లడించింది. బాపులపాడు 40.8°, గన్నవరం 41.2°, గుడివాడ 40.2°, కంకిపాడు 40.7°, నందివాడ 40.1°, పెనమలూరు 40.9°, ఉంగుటూరు 40.9°, పెదపారుపూడి 40.3°, తోట్లవల్లూరు 40°, ఉయ్యూరు 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.