News January 6, 2025
కృష్ణా: ఆ పరీక్షలలో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే.!
మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం కానిస్టేబుల్(మహిళలు) అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు జరిగాయి. ఇందులో 543 మందికిగాను 304 మంది బయోమెట్రిక్‌కు హాజరయ్యారని జిల్లా SP కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. వీరిలో 148 మంది డిస్ క్వాలిఫై అయ్యారని, ఇవాళ హాజరైనవారిలో 156 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారని జిల్లా SP కార్యాలయం వివరాలు వెల్లడించింది.
Similar News
News January 9, 2025
NTR: తల్లిని హత్య చేసిన కూతురు
ఇబ్రహీంపట్నంలో ఈనెల 7న ఎస్తేరు (పాస్టర్) అనే మహిళ హత్యకు గురైన విషయం తెలిసిందే. కొండపల్లికి చెందిన ఎస్తేరుకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె జీవమణికి గతంలో పెళ్లి కాగా, భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఈక్రమంలో షేక్ నాగూర్ వలీతో జీవమణికి అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో తల్లి మందలించడంతో కక్ష పెంచుకొని హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసినట్లు ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ తెలిపారు.
News January 9, 2025
రీసర్వేలో కచ్చితత్వానికి ప్రాధాన్యమివ్వాలి: కలెక్టర్
రీసర్వేలో కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా రీసర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీశ క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామాల్లో రీసర్వేపై వర్క్‌షాప్ నిర్వహించారు.
News January 8, 2025
కూచిపూడి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
మొవ్వ మండలం కూచిపూడి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయ్యంకి అడ్డరోడ్డు వద్ద మోటార్ సైకిల్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న అయ్యంకి గ్రామానికి చెందిన నాగరాజు(39), పెద్ద మునేశ్వరరావు (60) అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.