News July 20, 2024

కృష్ణా: ఇంకా దొరకని MPDO వెంకటరమణ ఆచూకీ

image

ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణారావు ఆచూకీ ఇంకా లభించలేదు. ఆయన ఆచూకీ లభ్యం కాకపోవడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు పోలీసుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ఏలూరు కాలవను జల్లెడపడుతున్నా ఇంత వరకు ఆనవాళ్లు కూడా కనిపించలేదు. దీంతో ఎంపీడీవో ఏమయ్యారన్న ఆందోళన నెలకొంది. 

Similar News

News December 8, 2025

మచిలీపట్నం: అనాధ పిల్లలకు ఆరోగ్య కార్డుల పంపిణీ

image

అనాధ పిల్లలకు ఆరోగ్య పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లో ఎన్టీఆర్ వైద్య సేవల అమృత ఆరోగ్య పథకం కింద 17 అనాధ ఆశ్రమాలకు చెందిన 82 మంది అనాధ పిల్లలకు కలెక్టర్ చేతుల మీదుగా ఆరోగ్య కార్డులు అందజేశారు. ఆరోగ్యశ్రీ కార్డుల మాదిరి ఈ కార్డులు కూడా పని చేస్తాయన్నారు. కార్యక్రమంలో DMHO యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.

News December 8, 2025

గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో ఫ్లైట్ రద్దు

image

విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే విజయవాడ-ఢిల్లీ, ఢిల్లీ-VJA ఇండిగో సర్వీసులు సోమవారం రద్దయ్యాయి. మధ్యాహ్నం 2:20 గంటలకు గన్నవరం చేరుకోవాల్సిన విమానం, 2:50 గంటలకు దిల్లీకి బయలుదేరాల్సిన విమానం సాంకేతిక కారణాల వల్ల రద్దు అయినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులకు టికెట్ ఛార్జీల రీఫండ్ లేదా రీషెడ్యూల్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచామని ఇండిగో సంస్థ పేర్కొంది.

News December 8, 2025

సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో లొంగిపోయిన మరో నిందితుడు

image

సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో మరో నిందితుడు సోమవారం లొంగిపోయాడు. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్‌లో వంశీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన కొమ్మకోట్ల లొంగిపోయాడు. ఇదే కేసులో ఇటీవల తేలప్రోలు రాము, వజ్రా కుమార్ లొంగిపోగా, యుర్రంశెట్టి రామాంజనేయులు అరెస్టయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ నేత వల్లభనేని వంశీ గతంలోనే అరెస్ట్ అయ్యారు.