News April 12, 2025
కృష్ణా: ఇంటర్ ఫలితాల్లో నాడు.. నేడు.. స్టేట్ ఫస్టే

ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా మళ్లీ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. మూడు సంవత్సరాలుగా ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలుస్తూ వస్తున్నారు. లాస్ట్ ఇయర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 84% ఫలితాలు రాగా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 90% మంది ఉత్తీర్ణులయ్యారు. నేడు విడుదలైన ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 85%, ద్వితీయ సంవత్సరంలో 93% మంది ఉత్తీర్ణులయ్యారు.
Similar News
News April 20, 2025
కృష్ణా: LLB పరీక్షల ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన LLB 3వ, 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం సూచించింది.
News April 20, 2025
పెనమలూరు: రూ. 22 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న తాడిగడపకు చెందిన నూకల విజయశ్రీని సైబర్ నేరగాళ్లు భారీ మోసం చేశారు. ఆన్‌లైన్ టాస్కుల పేరుతో గ్రూపుల్లో చేర్చి, పెట్టుబడికి అధిక లాభాలంటూ నమ్మబలికిన నేరస్తులు దశలవారీగా ఆమె నుంచి రూ.22 లక్షలు దోచుకున్నారు. స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 20, 2025
కోర్టుకెళ్లి నష్టపరిహారం వసూలు చేస్తా: ఎమ్మెల్యే

హైదరాబాద్ పరిధిలోని కొండాపూర్‌లో 39 ఎకరాల స్థల వివాదంలో హైడ్రా రంగంలోకి దిగింది. శనివారం పోలీసుల బందోబస్తుతో అక్కడికి చేరుకున్న అధికారులు, స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌తో పాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించారు. ఈ స్థలం ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌కు చెందినదని సమాచారం. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లి నష్టపరిహారం వసూలు చేస్తామని తెలిపారు.