News July 16, 2024
కృష్ణా: ఇగ్నోలో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ద్వారా ఆన్లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో పలు కోర్సులలో అడ్మిషన్లకై దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. నిన్నటితో ఈ గడువు ముగియగా, జులై 31 వరకు పెంచినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. వివరాలకు విజయవాడలోని ఇగ్నో స్టడీ సెంటర్లో సంప్రదించాలని లేదా https://ignouiop.samarth.edu.in/ వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించాయి.
Similar News
News December 22, 2024
గుండెపోటుతో హాస్పిటల్కి వెళుతుండగా ప్రమాదం
తిరువూరు మండలం మునుకుళ్ల గ్రామంలో సామేలు అనే వ్యక్తికి గుండెపోటు రావడంతో అతనిని హాస్పిటల్కు తీసుకు వెళుతున్న క్రమంలో ఆటో అదుపుతప్పి ఓ ఇంటి గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో సామేలు అక్కడికక్కడే మృతిచెందగా అతనికి సాయంగా వస్తున్న అతని భార్య పున్నమ్మ, ఆటో డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ చెప్పారు.
News December 22, 2024
విజయవాడ: కోణార్క్ ఎక్స్ప్రెస్ను దారి మళ్లించిన అధికారులు
మోటుమర్రి జంక్షన్లో 3వ లైన్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా CST ముంబై, భువనేశ్వర్ మధ్య ప్రయాణించే కోణార్క్ ఎక్స్ప్రెస్లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. ఈ మేరకు నం.11019 & 11020 కోణార్క్ ఎక్స్ప్రెస్లు 2025 జనవరి 6 నుంచి 8 వరకు గుంటూరు – పగిడిపల్లి మీదుగా ప్రయాణిస్తాయన్నారు. ఆయా తేదీలలో ఈ రైళ్లు మధిర, ఖమ్మం టౌన్, మహబూబాబాద్, వరంగల్, ఖాజీపేటలో ఆగవని శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
News December 22, 2024
కృష్ణా: పీజీ డిప్లొమా పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కాలేజీల్లో యోగాలో పీజీ డిప్లొమా కోర్స్ చదివే విద్యార్థులు రాయాల్సిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2023- 24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ పరీక్షలు జనవరి 21 నుంచి నిర్వహించనున్నట్లు ANU పరీక్షల విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు 2025 జనవరి 21లోపు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు ANU వెబ్సైట్ చూడాలంది.