News November 28, 2024
కృష్ణా: ‘ఈనెల 30వరకు ఆ పని చేయకండి’
నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు గరిష్ఠంగా 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నెల 30 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని APSDMA హెచ్చరించింది. వాయుగుండం ప్రభావం ఉన్నందున జిల్లా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
Similar News
News December 5, 2024
RWS అధికారులకు కీలక ఆదేశాలిచ్చిన కలెక్టర్
కృష్ణా జిల్లా కలెక్టర్ DK బాలాజీ బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా(RWS) అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో ఆయన మండలాలవారీగా తాగునీటి పథకాల మరమ్మతు పనులు, అంగన్వాడీ టాయిలెట్ల నిర్మాణాలు, మరమ్మతు పనుల గురించి సమీక్షించారు. CSR, ఎంపీ ల్యాడ్స్, జిల్లా మినరల్ ఫండ్స్‌తో ఈ పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని RWS అధికారులకు కలెక్టర్ DK బాలాజీ ఆదేశాలిచ్చారు.
News December 4, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు(2020-21 విద్యా సంవత్సరం) రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదలైంది. DEC 18-2025 JAN 3 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. టైం టేబుల్ పూర్తి వివరాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.
News December 4, 2024
ఎన్టీఆర్: వైసీపీ నేత విద్యాసాగర్ కేసులో తీర్పు రిజర్వ్
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కేసును బుధవారం హైకోర్టు విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేసు తీర్పును ఈనెల 9న ఇస్తామని పేర్కొంది. విద్యాసాగర్ 76 రోజులుగా జైలులో ఉన్నాడని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. బెయిల్ ఇస్తే నిందితుడు విద్యాసాగర్ కేసును ప్రభావితం చేస్తారని నటి కాదంబరి తరఫు లాయర్ పేర్కొన్నారని తాజాగా సమాచారం వెలువడింది.