News October 23, 2024

కృష్ణా: ఈ నెల 26తో ముగియనున్న గడువు 

image

ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ITI కళాశాలల్లో అడ్మిషన్ పొందేందుకు 8వ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని విజయవాడ ITI కాలేజీ ప్రిన్సిపల్ ఎం.కనకారావు తెలిపారు. https://www.iti.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అడ్మిషన్లకు ఈ నెల 26లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఈ నెల 28న ప్రభుత్వ, 30న ప్రైవేట్ ITI కళాశాలల్లో అడ్మిషన్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

Similar News

News November 4, 2024

కృష్ణా: ఇన్‌ఛార్జ్ మంత్రి సుభాష్‌తో భేటీ అయిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

image

మచిలీపట్నంలో కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సుభాష్‌ వాసంశెట్టితో సోమవారం కలెక్టర్ DK బాలాజీ, ఎస్పీ ఆర్.గంగాధర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మచిలీపట్నం ఆర్అండ్‌బీ అతిథిగృహంలో ఈ భేటీ జరిగింది. ఈ మేరకు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న పలు పథకాలు, కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టుల గురించి కలెక్టర్ DK బాలాజీ, మంత్రి సుభాష్‌కు వివరించారు.

News November 4, 2024

బాస్కెట్‌బాల్ పోటీల్లో ద్వితీయ స్థానంలో కృష్ణ 

image

పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహిస్తున్న ఎస్జీఎఫ్ బాస్కెట్‌బాల్ అండర్ 14 రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో తూర్పుగోదావరి జట్టుపై తలపడి ఓటమిపాలైంది. అయితే కృష్ణాజిల్లా జట్టు నుంచి కుసుమ, ఆర్ వాహినిలు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కోచ్ వాకా నాగరాజు తెలిపారు. 

News November 3, 2024

విజయవాడ వైసీపీ మీడియా అకౌంట్లపై 45 కేసులు

image

విజయవాడ వ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ఖాతాలపై ఆదివారం పోలీసులు 45 కేసులు నమోదు చేశారు. చింతాప్రదీప్ రెడ్డి దర్శన్ పిఠాపురం పావలా ఏకే ఫ్యాన్ అనే సోషల్ మీడియా ఎకౌంట్లపై జనసేన, టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన మేరకు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మాచవరం గుణదల పోలీస్ స్టేషన్లో వీరి అకౌంట్లపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.