News December 16, 2024
కృష్ణా: ‘ఈ రోజే లాస్ట్ డేట్.. అప్లయ్ చేసుకోండి’

కృష్ణా జిల్లాలో వైద్యశాఖలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిన 18 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ల్యాబ్ టెక్నీషియన్(4), ఫిమేల్ నర్సింగ్(8), వాచ్మెన్(6) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తు వివరాలకై https://krishna.ap.gov.in/ చూడాలని, పూర్తి చేసిన దరఖాస్తులను సోమవారం సాయంత్రం 5గంటల లోపు మచిలీపట్నంలోని DM&HO కార్యాలయంలో అందజేయాలని అధికారులు సూచించారు.
Similar News
News December 5, 2025
కృష్ణా: గోనె సంచుల కొరతపై సీఎస్ అరా

ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లాలో నెలకొన్న గోనె సంచుల కొరతపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ అరా తీశారు. ధాన్యం సేకరణపై గురువారం ఆయన రాష్ట్ర సచివాలయాల నుంచి కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. జిల్లాలో కోటి గోనె సంచుల అవసరాన్ని గుర్తించగా ఇప్పటికే 50 లక్షలు రైతులకు పంపిణీ చేశామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి గోనె సంచుల సరఫరాకు సహకరించాలని సీఎస్‌ను కోరారు.

News December 4, 2025
గుడివాడ-కంకిపాడు రోడ్డు నిర్మాణం ప్రారంభించండి: బాలశౌరి

ఢిల్లీలోని పార్లమెంట్ హాల్లో CoSL ఛైర్మన్ ఎంపీ బాలశౌరితో నేషనల్ హైవే ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గుడివాడ-కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, పెడన లక్ష్మీపురం రోడ్డు, తదితర పనులను ఎంపీ బాలశౌరి NHAI ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించి, ఆ పనులను త్వరగా ప్రారంభించాలని సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.