News October 24, 2024
కృష్ణా: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
మత్స్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన 3 డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిషరీస్, జువాలజీ అనుబంధ కోర్సులలో పీజీ చేసినవారు ఈ పోస్టులకు అర్హులు కాగా అభ్యర్థులు ఈ నెల 24లోపు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ నమూనా, విద్యార్హతల వివరాలకై https://fisheries.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చన్నారు. ఎంపికైన వారికి ప్రతి నెలా రూ.45 వేలు రెమ్యునరేషన్ కింద ఇస్తారు.
Similar News
News November 12, 2024
కృష్ణా: LLM కోర్సుల అకడమిక్ క్యాలెండర్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలో LLM కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన టెంటేటివ్ అకడమిక్ క్యాలెండర్ సోమవారం విడుదలైంది. ప్రతి సెమిస్టర్‌లో 90 పనిదినాలుండేలా అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించామని విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. LLM కోర్సుల ఇంటర్నల్, థియరీ, ప్రాక్టికల్ పరీక్షల తేదీల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్‌లో అకడమిక్ క్యాలెండర్‌ను చూడవచ్చు.
News November 12, 2024
జనవరి నాటికి జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు: కొలుసు
రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ జనవరి 2025 నాటికి అక్రెడిటేషన్లు ఇవ్వనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పేర్కొన్నారు. నివేశన స్థలాలు, గృహ నిర్మాణాలను కూడా ప్రభుత్వమే చేపట్టే విధంగా ఆలోచిస్తున్నామన్నారు. అక్రెడిటేషన్ కమిటీలు యూనియన్ నేతలకు చాన్సు ఉంటుందన్నారు.
News November 12, 2024
తిరువూరులో అర్ధరాత్రి విషాదం
తిరువూరులో సోమవారం అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. తిరువూరు లక్ష్మీపురానికి చెందిన ఇస్మాయిల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తన ఇంటి ఆవరణంలో ఉన్న పాకలో మంచం మీద పడుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి సుమారు 12 గంటల సమయంలో విద్యుత్ షాక్ తో ఇంటి పూరీపాక కాలిపోవడంతో పడుకున్న ఇస్మాయిల్ కూడా కాలిపోయాడు. స్థానికులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయగా వచ్చి మంటలను అర్పివేశారు.