News February 2, 2025
కృష్ణా: ఎన్నికల నిర్వహణకు నిస్పక్షపాతంగా సహకరించాలి- కలెక్టర్

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికలను నిస్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. శనివారం కలెక్టరేట్లో ఆయన తన ఛాంబర్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News December 12, 2025
కృష్ణా: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష (JNVST-2026) శనివారం జిల్లా వ్యాప్తంగా జరగనుంది. మొత్తం 17 కేంద్రాల్లో 1,894 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) యు.వి. సుబ్బారావు తెలిపారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ వెల్లడించారు.
News December 12, 2025
దివ్యాంగుల సేవలు ప్రతి గ్రామానికి చేర్చాలి: DEO

దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామీణ స్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా డీఈఓ యు.వి. సుబ్బారావు ఎంఈఓలకు సూచించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని కృష్ణవేణి ఐటీఐ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన సహిత విద్యపై ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
News December 12, 2025
తాగునీరు, పారిశుద్ధ్య పనులను సజావుగా చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్య పనులు సజావుగా చేపట్టి, ఎక్కడా కూడా వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు చేపట్టాలని, మంజూరైన వివిధ పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్లో జిల్లా తాగునీరు పారిశుద్ధ్య కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు.


