News November 11, 2024
కృష్ణా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గొంతు వినిపిస్తారా?

నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి కృష్ణా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు రోడ్ల సమస్యలు, తోటపల్లి ఎత్తిపోతల పథకం కాలువ పనులు, యువతకు ఉద్యోగ కల్పన తదితర అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన ఎమ్మెల్యేలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలుకు నిధులు వచ్చేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? మీ కామెంట్.
Similar News
News December 2, 2025
మచిలీపట్నం లేదా పెడన నుంచి పోటీకి రెడీ..!

జనసేన నాయకుడు కొరియర్ శ్రీను టీవీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే తాను మచిలీపట్నం లేదా పెడన నుంచి ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమని ఆయన ప్రకటించారు. దీంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో టికెట్ సమీకరణపై ప్రభావం చూపుతుందనే చర్చ జనసేన వర్గాల్లో నడుస్తోంది.
News December 2, 2025
కృష్ణా: అదుపుతప్పిన ఆటో.. డ్రైవర్ మృతి

పమిడిముక్కల మండలం రెడ్డిపాలెం రామాలయం చెరువు వద్ద మంటాడ నుంచి వీరంకిలాకు వెళుతున్న ఆటో అదుపు తప్పి సిగ్నల్ స్తంభాన్ని ఢీకొని చెరువులో పడిపోయింది. డ్రైవర్ దేశి నాగరాజు (50) స్పాట్‌లోనే మృతి చెందాడు. మహిళా ప్రయాణికులను స్థానికులు రక్షించి ఉయ్యూరు ఆసుపత్రికి తరలించారు.
News December 1, 2025
కృష్ణా: తీరప్రాంత ప్రజలకు నెరవేరని మంచినీటి కల.!

తరాలు మారినా తమ తలరాతలు మాత్రం మారలేదంటూ సముద్ర తీరం ప్రాంతమైన కృత్తివెన్ను మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చి వెళ్లినా గుక్కెడు మంచినీరు అందించలేకపోయారని, ఇప్పటికీ కుళాయి నీరు అందక మినరల్ వాటర్ ప్లాంట్ నీరే శరణ్యంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు శుద్ధ జల సరఫరా జరుగుతుందనే ఆశతో చూస్తున్నాం అంటున్నారు.


