News February 28, 2025
కృష్ణా: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయని ఆ నలుగురు.!

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. కానీ జిల్లాలో ఆ నలుగురు మాత్రం తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఆ నలుగురు ఏ రాజకీయ ప్రముఖులో అనుకుంటున్నారా.? కాదండి వారు సాధారణ ఓటర్లే.. కానీ ప్రత్యేకం. వారెవరో కాదు ఓటు హక్కు కలిగిన థర్డ్ జెండర్ ఓటర్లు. జిల్లాలో నలుగురు థర్డ్ జెండర్ ఓటర్లు ఓటు హక్కు పొంది ఉండగా వారు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు.
Similar News
News December 12, 2025
దివ్యాంగుల సేవలు ప్రతి గ్రామానికి చేర్చాలి: DEO

దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామీణ స్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా డీఈఓ యు.వి. సుబ్బారావు ఎంఈఓలకు సూచించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని కృష్ణవేణి ఐటీఐ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన సహిత విద్యపై ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
News December 12, 2025
తాగునీరు, పారిశుద్ధ్య పనులను సజావుగా చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్య పనులు సజావుగా చేపట్టి, ఎక్కడా కూడా వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు చేపట్టాలని, మంజూరైన వివిధ పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్లో జిల్లా తాగునీరు పారిశుద్ధ్య కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు.