News March 5, 2025
కృష్ణా: ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్ల సంఖ్య ఇదే

ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించిన విషయంలో తెలిసిందే. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు వేసిన ఓట్లు కొన్ని చెల్లలేదు. మొత్తం 26, 679 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు. ప్రతి రౌండ్‌లోనూ 2 వేలకు పైగా చెల్లని ఓట్లు పడినట్లు తెలిసింది. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్‌లో కూడా 55 ఓట్లు చెల్లలేదు.
Similar News
News March 6, 2025
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ4 సర్వే: కలెక్టర్

పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్ (P4) సర్వేకు రూపకల్పన చేసిందని, ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించే ఈ సర్వేను విజయవంతం చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో MPDOలు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులతో సమీక్షించారు.
News March 6, 2025
గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా వంశీ ఉన్నారు. వంశీని మరో 10 రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో వంశీ సరిగ్గా సహకరించలేదని పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న వ్యక్తులు పరారీలోనే ఉన్నారు.
News March 6, 2025
కృష్ణా జిల్లాలో 39.9 డిగ్రీల ఎండ

కృష్ణా జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఎండ మండిపోయింది. ముఖ్యంగా కంకిపాడులో 39.9 నమోదు కాగా.. బాపులపాడు, గన్నవరం, పెనమలూరులలో 39 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో ఉన్నదాని కంటే నాలుగు శాతం ఉష్ణోగ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.