News March 24, 2025

కృష్ణా: ఏపీపీఎస్సీ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు- DRO

image

ఈ నెల 25వ నుంచి 27వ తేదీ వరకు మూడు రోజులపాటు జిల్లాలో నిర్వహించనున్న ఏపీపీఎస్సీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్ఓ చంద్రశేఖరరావు తెలిపారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సోమవారం తన ఛాంబర్‌లో ఆయన సమీక్షించారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పెడనలో 1, పెనమలూరులో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Similar News

News October 25, 2025

నేడు కలెక్టరేట్‌లో వాహనాలకు నిషేధం

image

శబ్ద, వాయు కాలుష్య నివారణలో భాగంగా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 25వ తేదీ శనివారం రోజున వాహనాలపై నిషేధం విధించారు. కలెక్టరేట్‌లో పనిచేసే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా కాలినడకన లేదా సైకిల్‌పై విధులకు హాజరు కావాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. ఆ రోజు కలెక్టరేట్ ప్రాంగణంలో ఎటువంటి మోటారు వాహనాలకు ప్రవేశం ఉండదని ఆయన స్పష్టం చేశారు.

News October 24, 2025

కృష్ణా జిల్లాలో వర్షపాతం వివరాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 46.2 మి.మీల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అత్యధికంగా గూడూరు మండలంలో 89.2 మి.మీల వర్షపాతం నమోదు అవ్వగా అత్యల్పంగా నాగాయలంక మండలంలో 19.6మి.మీల వర్షపాతం నమోదైంది. రానున్న 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News October 24, 2025

కృష్ణా జిల్లా DMHOగా బాధ్యతలు స్వీకరించిన డా. యుగంధర్

image

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి(DMHO)గా డా. యుగంధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. DMHOగా బాధ్యతలు నిర్వర్తించిన డా. శర్మిష్ట గత నెల పదవీ విరమణ చేయగా ఆమె స్థానంలో యుగంధర్ నియమితులయ్యారు. ఎముకల శస్త్ర చికిత్స నిపుణుడైన యుగంధర్ గతంలో గుడివాడ, అవనిగడ్డలో పని చేశారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా కూడా పని చేశారు. నూతన DMHOను పలువురు ఉద్యోగులు కలిసి అభినందనలు తెలిపారు.