News April 1, 2025

కృష్ణా: ఏప్రిల్ ఫూల్ చేశారా ఎవరినైనా.?

image

ఏప్రిల్ 1 వచ్చిందంటే పిచ్చి పనుల పండగే. ఒకరిని ఒకరు వంచించి, లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పుకుంటూ నవ్వుల జల్లు కురిపించేవారు. 2010-12 వరకు ఏప్రిల్ ఫూల్ హంగామా రచ్చరచ్చగా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లోనే మెసేజ్‌లతో సరిపెట్టుకుంటున్నారు. మీకు ఎప్పుడైనా షాకింగ్ ఏప్రిల్ ఫూల్ అనుభవం వచ్చిందా.? కామెంట్ చేయండి..

Similar News

News April 8, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ కృష్ణా : యూజీ పరీక్షల షెడ్యూల్ విడుదల 
☞ కృష్ణా : 37 మందికి గ్రేడ్ -3 కార్యదర్శులగా పదోన్నతి 
☞ గన్నవరం : వంశీ కి 22 వరకు రిమాండ్ పొడిగింపు
☞ గుడివాడ: మందుబాబులపై లోకేశ్ సెటైరికల్ పోస్ట్
☞ కృష్ణా: అధికారులు పని తీరుపై కలెక్టర్ సీరియస్
☞ గన్నవరం: చైన్ స్నాచింగ్ గ్యాంగ్ అరెస్ట్
☞ కృష్ణా జిల్లాప్రధాన న్యాయమూర్తి బదిలీ

News April 8, 2025

కృష్ణా జిల్లాలో 37 మందికి గ్రేడ్-3 కార్యదర్శులుగా పదోన్నతి

image

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 37 గ్రామ పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పిస్తూ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా పని చేస్తున్న 19 మంది, జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న 18 మంది జూ.అసిస్టెంట్లను గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సంబంధిత పదోన్నతులు పొందిన కార్యదర్శులకు కలెక్టర్ అందజేశారు.

News April 8, 2025

గుడివాడ: మందుబాబులపై లోకేశ్ సెటైరికల్ పోస్ట్

image

గుడివాడలో ఇంజినీరింగ్ కాలేజీ వెనుక బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ కెమెరాలతో పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. `పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని చూస్తే జాలేస్తోంది. సారీ గాయ్స్‌.. నేను మీకు ఎలాంటి హెల్ప్‌ చేయలేకపోతున్నా.. ఎందుకంటే ఏపీ పోలీసులు వారి బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు’ అని X లో పోస్ట్ చేశారు.

error: Content is protected !!