News July 28, 2024
కృష్ణా: ఏలూరు వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నం.22837 హటియా- ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 29, ఆగస్టు 5, 12, 19, 26వ తేదీల్లో విజయవాడ- ఏలూరు మీదుగా కాక విజయవాడ- గుడివాడ- భీమవరం మార్గం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఆయా తేదీలలో ఈ ట్రైన్‌కు ఏలూరులో స్టాప్ లేదని పేర్కొన్నారు.
Similar News
News January 9, 2026
గంజాయి అమ్మకాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

కృష్ణా జిల్లాలో గంజాయి అమ్మకాలను నియంత్రించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన నార్కోటిక్స్ సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్‌లో జరిగింది. జిల్లాలో ఎక్కడా గంజాయి, మాదకద్రవ్యాల అమ్మకాలు జరగరాదన్నారు. కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచి అమ్మకాలను నియంత్రించాలన్నారు.
News January 9, 2026
కృష్ణా: Way2Newsలో రిపోర్టర్‌గా చేరాలనుకుంటున్నారా.!

కృష్ణా జిల్లాలోని పామర్రు, గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల్లో Way2Newsలో పనిచేయాడానికి రిపోర్టర్2లు కావలెను. ఆర్హత.. ఏదైనా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్లకు మాత్రమే. ఆసక్తి గలవారు ఈ <
News January 9, 2026
మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్‌పై హైకోర్టు సీరియస్

మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ జిల్లా కార్యాలయ భవన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పణ విషయంలో జరిగిన జాప్యంపై సీరియస్ అయింది. కోర్టు ఆదేశాలు పట్టవా..? అంటూ కమిషనర్‌ను నిలదీసింది. జాప్యానికి గల కారణాలపై వెంటనే అఫిడవిట్ వేయాలని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు.


