News May 11, 2024
కృష్ణా: ఓటర్లకు ప్రలోభాలు.?

మరికొన్ని గంటల్లో కృష్ణా జిల్లాలో ఓట్ల పండగ జరగనుంది. నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుండగా, ఓటర్లను నాయకులు ప్రభావితం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. విజయవాడ తూర్పులో ఓటుకు రూ.1,500, సెంట్రల్‌లో రూ.2వేలు, నందిగామ, జగ్గయ్యపేటల్లో పరిస్థితిని బట్టి రూ.1500 నుంచి రూ.2వేలు, గుడివాడ, పెనమలూరులో రూ.2వేలు పంచుతున్నట్లు సమాచారం. ప్రత్యర్థులు తమకంటే ఎక్కువిస్తే.. రెండోసారి పంపిణీకి సిద్ధమవుతున్నారు.
Similar News
News February 23, 2026
కృష్ణా: 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్‌కు ప్రణాళికలు

విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి గంగూరు వరకు 14KM ఎలివేటెడ్ మెగా ఫ్లైఓవర్ కారిడార్ నిర్మాణానికి NH అధికారులు సానుకూలంగా స్పందించారు. బందరు రోడ్డునుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్ ఆటంకం లేకుండా అమరావతి వైపు ప్రయాణించేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోడ్డు విస్తరణ లేకుండానే 6 వరుసల ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. గంగూరు- దావులూరు ORR వరకు హైవేను 6 లైన్లుగా విస్తరిస్తారు.
News February 23, 2026
కృష్ణా: అపరాల కోతలకు కూలీల కొరత

జిల్లాలో రెండో పంటగా సాగుచేసిన అపరాల పంట కోతల దశకు చేరుకోవడంతో రైతులకు కూలీల కొరత తీవ్రంగా ఎదురవుతోంది. స్థానికంగా వ్యవసాయ కూలీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కూలీలు పెద్ద సంఖ్యలో జిల్లాకు తరలివస్తున్నారు. ప్రస్తుతం అపరాల పంట కోతలు వేగంగా సాగుతున్న నేపథ్యంలో కూలీలకు డిమాండ్ ఏర్పడింది.
News February 23, 2026
కృష్ణా: ఇంటర్మీడియట్ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సారి ఫస్ట్ ఇయర్‌కు 24,173 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రత, పర్యవేక్షణ కోసం 900 మంది ఇన్విజిలేటర్లు, మూడు సిట్టింగ్ స్క్వాడ్లు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు విధుల్లో ఉండనున్నాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది.


