News May 11, 2024

కృష్ణా: ఓటర్లకు ప్రలోభాలు.?

image

మరికొన్ని గంటల్లో కృష్ణా జిల్లాలో ఓట్ల పండగ జరగనుంది. నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుండగా, ఓటర్లను నాయకులు ప్రభావితం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. విజయవాడ తూర్పులో ఓటుకు రూ.1,500, సెంట్రల్‌లో రూ.2వేలు, నందిగామ, జగ్గయ్యపేటల్లో పరిస్థితిని బట్టి రూ.1500 నుంచి రూ.2వేలు, గుడివాడ, పెనమలూరులో రూ.2వేలు పంచుతున్నట్లు సమాచారం. ప్రత్యర్థులు తమకంటే ఎక్కువిస్తే.. రెండోసారి పంపిణీకి సిద్ధమవుతున్నారు.

Similar News

News December 16, 2025

కృష్ణాజిల్లా TDP అధ్యక్షుడిగా గురుమూర్తి.?

image

TDP కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా వీరంకి వెంకట గురుమూర్తి పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. తోట్లవల్లూరుకు చెందిన గురుమూర్తి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన TDPలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర గౌడ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక పదవులను ఆయన సమర్థవంతంగా నిర్వర్తించారు.

News December 16, 2025

మచిలీపట్నం చేరుకున్న నారా లోకేష్

image

టీడీపీ యువ నాయకుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం మచిలీపట్నం చేరుకున్నారు. స్థానిక న్యూ హౌసింగ్ బోర్డ్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కాంస్య విగ్రహావిష్కరణలో పాల్గొనేందుకు ఆయన మచిలీపట్నం చేరుకున్న లోకేష్‌కు 3 స్థంభాల సెంటర్‌లో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు.

News December 16, 2025

మచిలీపట్నం: ‘అటల్-మోదీ’ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే.!

image

నేడు మచిలీపట్నం రానున్న ‘అటల్-మోదీ’ సుపరిపాలన బస్సు యాత్ర రూట్ మ్యాప్‌ను ఆ పార్టీ నేతలు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక మూడు స్థంభాల సెంటర్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. చల్లరాస్తా సెంటర్, కోనేరుసెంటర్, బస్టాండ్, లక్ష్మీటాకీస్, డీ మార్ట్ రోడ్డు మీదుగా న్యూ హౌసింగ్ బోర్డ్ సర్కిల్‌కు చేరుకుంటుంది. వాజ్ పేయి విగ్రహావిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.