News July 21, 2024
కృష్ణా: కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీ.కే బాలాజీ తెలిపారు. భారీ వర్షాలు, వరదలు వల్ల ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08672-252572కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితిని ఎదుర్కొనేందుకు జిల్లా, డివిజన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News October 6, 2024
కృష్ణా జిల్లాలోృ 99% మేర ఈ-క్రాప్ నమోదు పూర్తి: కలెక్టర్
కృష్ణా జిల్లాలో 99% మేర ఈ-క్రాప్ నమోదు, 89% మేర ఈ కేవైసీ పూర్తయినట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. నూరు శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన పంటలు ఈ-క్రాప్‌లో నమోదు చేసుకుని ఈ కేవైసీ చేయడం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందటానికి వీలవుతుందన్నారు.
News October 6, 2024
నేడు మచిలీపట్నంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ హీరోగా నటించిన ‘జనక అయితే గనక’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు మచిలీపట్నం నోబుల్ కాలేజ్‌లో జరగనుంది. సాయంత్రం 5 గంటలకు నోబుల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌కు హీరో హీరోయిన్ సుహాస్, సంగీర్తనతోపాటు ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజ్, చిత్ర యూనిట్ మొత్తం తరలి రానుంది. కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విస్తృత ఏర్పాట్లు చేశారు.
News October 6, 2024
ప్రజలపై టికెట్ రేట్ల భారం మోపము: ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల
ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ళ నారాయణరావు విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో అధికారుల సమక్షంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను సురక్షితంగా, సౌలభ్యంగా గమ్యాలకు చేర్చే సాధనం ఏపీఎస్ఆర్టీసీ అన్నారు. ఆర్టీసీకి నష్టం వచ్చినా, ప్రజలపై టికెట్ భారం వేయకుండా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. పేదవారికి, మధ్య తరగతి వారికి ఆర్టీసీని అందుబాటులో ఉంచుతామన్నారు.