News February 5, 2025
కృష్ణా: కేంద్ర పథకాలపై అన్ని శాఖలు దృష్టి సారించాలి- కలెక్టర్

ప్రజల సంక్షేమాభివృద్ధికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాల ప్రగతితో పాటు ప్రజలకు అవగాహన లేకుండా మరుగున పడిపోయిన కేంద్ర ప్రభుత్వ పథకాలపై అధికారులతో చర్చించారు.
Similar News
News February 7, 2025
రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా వాసులు మృతి

ప.గో జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన <<15374910>>రోడ్డు ప్రమాదంలో<<>> ఇద్దరు చనిపోయారు. మృతులు కృష్ణా(D) బాపులపాడు మండలం ఆరుగొలనుకు చెందిన దేవ మందిరం, విజయ్ బాబుగా గుర్తించారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబాల్లో వీరి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. దేవ మందిరానికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. విజయ్‌బాబుకి భార్య, ఐటీఐ చదివే కుమారుడు, టెన్త్ చదువుతున్న కుమార్తె ఉన్నారు.
News February 7, 2025
కంకిపాడులో యువకుడి సూసైడ్

కంకిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు(17) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చదువు మానేశాడని ఇంట్లో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
News February 7, 2025
బైక్ చక్రంలో చీర ఇరుక్కొని మహిళ మృతి: ఎస్సై చంటిబాబు

చీర బైక్ చక్రంలో చిక్కుకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన గుడివాడ రూరల్ ప్రాంతంలో జరిగింది. సెరికలవపూడి గ్రామానికి చెందిన కోన నాగేశ్వరరావు భార్య కోన నాగమల్లేశ్వరి బంధువుల దిన కార్యక్రమానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో నూజెండ్ల గ్రామం వద్ద వారు వెళుతున్న బైక్ చక్రంలో చీర చిక్కుకొని ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో ఆమె మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై చంటిబాబు తెలిపారు.