News May 20, 2024

కృష్ణా: కొండెక్కిన మిర్చి ధరలు రూ.100

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పచ్చిమిర్చి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలలో పచ్చిమిర్చి ధర కేజీ రూ.100 వరకు చేరింది. దీంతో సామాన్యుల వంటింటికి పచ్చిమిర్చి రానంటోంది. మిర్చి తోటల నుంచి దిగుబడి తగ్గడంతో పచ్చిమిర్చి ధర పెరిగిందని అమ్మకందారులు చెబుతున్నారు. రిటైల్ మార్కెట్లో పచ్చిమిర్చి ధర పెరగడంతో అధికారులు రైతుబజార్ల ద్వారా తక్కువ ధరకు అమ్మకం సాగించాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News December 4, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల 

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు(2020-21 విద్యా సంవత్సరం) రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదలైంది. DEC 18-2025 JAN 3 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. టైం టేబుల్ పూర్తి వివరాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు. 

News December 4, 2024

ఎన్టీఆర్: వైసీపీ నేత విద్యాసాగర్ కేసులో తీర్పు రిజర్వ్ 

image

వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కేసును బుధవారం హైకోర్టు విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేసు తీర్పును ఈనెల 9న ఇస్తామని పేర్కొంది. విద్యాసాగర్ 76 రోజులుగా జైలులో ఉన్నాడని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. బెయిల్ ఇస్తే నిందితుడు విద్యాసాగర్ కేసును ప్రభావితం చేస్తారని నటి కాదంబరి తరఫు లాయర్ పేర్కొన్నారని తాజాగా సమాచారం వెలువడింది. 

News December 4, 2024

పశువుల ఆశ్రయ నిర్మాణాలు ఆవశ్యకం: DK బాలాజీ

image

హోమ్ మంత్రి అనిత బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కృష్ణా జిల్లా కలెక్టర్ DK బాలాజీ కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు జిల్లాలోని లంక గ్రామాలలో పశువుల ఆశ్రయ నిర్మాణాలు నిర్మించాలని బాలాజీ వీడియో కాన్ఫరెన్సులో తెలిపారు. విపత్తులు సంభవించినప్పుడు పశు నష్టం జరగకుండా ఈ భవనాలు ఉపయుక్తంగా ఉంటాయని బాలాజీ వివరించారు.