News March 24, 2025
కృష్ణా: క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడవద్దు: ఎస్పీ

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందని నమ్మి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడవద్దని ఎస్పీ ఆర్. గంగాధరరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బెట్టింగ్ యాప్స్ మోసపూరితమైన వల అని, అందులో చిక్కుకొని మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. ఐపీఎల్, టీ 20 క్రికెట్ మ్యాచ్లను ఆసరాగా తీసుకొని అమాయకులను బలి చేస్తున్నారని అన్నారు.
Similar News
News April 1, 2025
కృష్ణా: ప్రయాణికులకు అలర్ట్.. స్టాప్ తొలగించిన రైల్వే

నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే పలు రైళ్లకు మహబూబాబాద్(TG)లో తాత్కాలికంగా స్టాప్ తొలగించామని రైల్వే అధికారులు తెలిపారు. మే 24 నుంచి 28 వరకు నం.12749 మచిలీపట్నం-బీదర్ SF ఎక్స్‌ప్రెస్, నం.12709 గూడూరు-సికింద్రాబాద్ సింహపురి SF, నం.12759 తాంబరం-హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లు మహబూబాబాద్‌లో ఆగవని, ప్రయాణికులు గమనించాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.
News April 1, 2025
కృష్ణా: ‘పరీక్ష తర్వాత పేపర్లు చించకూడదు’

10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారం నిర్వహించే సోషల్ పరీక్షతో ముగిస్తాయి. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచినీరు ఏర్పాటు చేయాలని డీఈవో రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆఖరి పరీక్ష కావడంతో విద్యార్థులు పరీక్షా అనంతరం పుస్తకాలు చించి వేసి బయట వేయడం వంటివి చేయకుండా పాఠశాల యాజమాన్యాలు అవగాహన కల్పించాలన్నారు.
News March 31, 2025
అవనిగడ్డ: హైవేపై రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

అవనిగడ్డ మండల పరిధిలోని 216 జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగడ్డ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీ కొట్టింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తెనాలి వైపు నుంచి మోపిదేవికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అవనిగడ్డ సీఐ, ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.