News January 23, 2025

కృష్ణా: గమనిక..1వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలోని కాలేజీలలో బీఈడీ(2024-25 అకడమిక్ ఇయర్) చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్‌&సప్లిమెంటరీ థియరీ పరీక్షలను ఫిబ్రవరి 18 నుంచి నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 28లోపు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించాలని, వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని ANU సూచించింది.

Similar News

News January 24, 2025

కృష్ణా: బీపీఈడీ&డీపీఈడీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కాలేజీలలో బీపీఈడీ&డీపీఈడీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 1వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 10, 11,12,13 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది. 

News January 24, 2025

కృష్ణా: హోంగార్డులకు స్టడీ మెటీరియల్ అందించిన ఎస్పీ 

image

కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలోని మోటార్ ట్రాన్స్‌పోర్ట్ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు హోంగార్డులు ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ఎంపికలో భాగంగా ఫిజికల్ టెస్టులు పాసయ్యారు. ఈ నేపథ్యంలో ఎస్పీ గంగాధర్ గురువారం వారిని మచిలీపట్నంలోని తన కార్యాలయంలో అభినందించారు. అనంతరం వారందరికీ మెయిన్స్ పరీక్షకు కావలసిన స్టడీ మెటీరియల్ పుస్తకాలను ఆయన అందజేశారు.

News January 24, 2025

నేడు విజయవాడకు సీఎం చంద్రబాబు

image

విజయవాడకు శుక్రవారం సీఎం చంద్రబాబు రానున్నారు. 4 రోజుల దావోస్ పర్యటన అనంతరం ఆయన గురువారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకుంటారు. శుక్రవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్‌తో భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని రోడ్డు మార్గంలో ఉండవల్లి వెళతారు.