News April 10, 2024

కృష్ణా: గుంటూరు వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ట్రాఫిక్ మెయిన్‌టెనెన్స్ కారణంగా విజయవాడ మీదుగా న్యూ గుంటూరు వెళ్లే 2 రైళ్లను దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 30 వరకు ఈ రెండు రైళ్లు న్యూ గుంటూరు స్టేషన్ మీదుగా కాక తెనాలి, దుగ్గిరాల, కృష్ణా కెనాల్ మీదుగా వెళ్తాయన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.
*నం.16031 చెన్నై సెంట్రల్- SVD కత్ర అండమాన్ ఎక్స్‌పెస్ *నం.16093 చెన్నై సెంట్రల్- లక్నో ఎక్స్‌ప్రెస్ 

Similar News

News November 28, 2025

కృష్ణా జిల్లాకు దిత్వా తుఫాన్ హెచ్చరిక.!

image

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా కృష్ణా జిల్లాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్‌కు, దిత్వా తుఫాన్‌కు కొంత తేడా ఉంటుందని, మొంథా తుఫాన్ కారణంగా వీచిన ఈదురు గాలులు దిత్వా తుఫాన్ కారణంగా ఉండవన్నారు. కేవలం అధిక వర్షపాతం మాత్రమే నమోదవుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

News November 28, 2025

తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

రానున్న దిత్వా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డీ.కే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమైన ఆయన తుఫాన్ ముందస్తు జాగ్రత్త చర్యలపై శుక్రవారం సమీక్షించారు. ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని, రైతులను అప్రమత్తం చేసి కోసిన ధాన్యం తడిచి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు.

News November 28, 2025

ఇసుక కొరత లేకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇసుక కొరత లేకుండా సామాన్యులకు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక విధానం అమలుపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన కలెక్టర్, సరఫరా వ్యవస్థను క్రమబద్ధంగా నిర్వహించి వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.