News July 14, 2024
కృష్ణా: గెస్ట్ టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
చిలకలపూడి (మచిలీపట్నం)లోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో గెస్ట్ టీచర్ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వరరావు చెప్పారు. గణితం, భౌతికశాస్త్రం, సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థులు ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు చిలకలపూడిలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
Similar News
News October 8, 2024
అవనిగడ్డలో జాబ్ మేళా.. రూ.18వేల వరకు వేతనం
అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.విక్టర్ బాబు తెలిపారు. జాబ్ మేళాకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 18- 29 ఏళ్లలోపువారు హాజరు అవ్వొచ్చన్నారు. ఇందులో పలు ప్రముఖ కంపెనీలు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని, ఎంపికైన వారికి రూ.10- 18 వేల వరకు వేతనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తారని విక్టర్ బాబు చెప్పారు.
News October 8, 2024
కృష్ణా: M.Com పరీక్షల టైంటేబుల్ విడుదల
ఆచార్య నాగార్జున వర్సిటీ(డిస్టెన్స్) పరిధిలో M.Com(అకౌంటెన్సీ & బ్యాంకింగ్) చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 22 వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 22 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
News October 7, 2024
అభివృద్ధిలో మరో ముందడుగు పడింది: MLA సుజనా
NDA ప్రభుత్వ పాలనలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుతో రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధిలో మరో ముందడుగు పడిందని విజయవాడ పశ్చిమ MLA సుజనా ట్వీట్ చేశారు. రూ.25 వేల కోట్ల భారీ పెట్టుబడితో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుందని సుజనా తెలిపారు. ఈ ప్రాజెక్టుతో రాజధాని నుంచి సమీప జిల్లాలలో ప్రాంతీయ ప్రగతి మరింత పెరగనుందని ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.