News January 30, 2025
కృష్ణా: ఘోర ప్రమాదం.. ముగ్గురు యువకులు స్పాట్ డెడ్

మచిలీపట్నం-నరసాపురం 216 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృత్యువాత పడిన ఘటన పెడనలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకులను లారీ ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 12, 2025
హైదరాబాద్‌లో 99 తపాలా పోస్టులు

పోస్టల్ శాఖలో 31 GDS, 68 డాక్ సేవక్ పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్, బైక్ నడపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. #SHARE IT
News February 12, 2025
కరీంనగర్ జిల్లా పరిధిలోని ఓటర్ల వివరాలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 1,229 గ్రామ పంచాయతీలు, 649ఎంపీటీసీ స్థానాలు, 18,77,570 మంది ఓటర్లు ఉన్నారు. JTLజిల్లాలో385జీపీలు, 3,536 వార్డులు, 216ఎంపీటీసీలు, 6.09.496 మంది, KNR జిల్లాలో 318 జీపీలు, 2,962 వార్డులు,170ఎంపీటీసీలు, 5.08,489, PDPLజిల్లాలో 266 జీపీలు, 2,486 వార్డులు,140 ఎంపీటీసీలు, 4,13,306, SRSLజిల్లాలో 260 పంచాయతీలు, 2,268 వార్డులు, 123 ఎంపీటీసీ లు. 3,53,796 మంది ఓటర్లు ఉన్నారు.
News February 12, 2025
ధర్మవరంలో కేజీ చికెన్ రూ.160

రాష్ర్టంలో బర్డ్‌ఫ్లూతో పెద్ద ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్లకు వైరస్ సోకుతుండటంతో జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. ఈ క్రమంలో చికెన్ ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి. అయితే ధర్మవరంలో బర్డ్ ఫ్లూ సమస్య లేదని, ఇక్కడికి కర్ణాటక నుంచి కోళ్లు వస్తున్నట్లు స్థానిక వ్యాపారులు తెలిపారు. కేజీ చికెన్ రూ.160, స్కిన్ లెస్ కేజీ రూ.180తో విక్రయిస్తున్నట్లు చెప్పారు.