News October 3, 2024
కృష్ణా: చిల్లర సమస్యలకు చెక్ పెట్టేలా RTC కీలక నిర్ణయం

దసరాను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని APSRTC అధికారులు తెలిపారు. ఈ నెల 4 నుంచి 20 వరకు సాధారణ ఛార్జీలతోనే ఈ బస్సులు నడుపుతామన్నారు. ప్రయాణికులకు చిల్లర సమస్య రాకుండా ఉండేందుకు UTS, నగదు చెల్లింపు యాప్స్ అందుబాటులో ఉంటాయన్నారు. దసరా సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు మొత్తంగా 6,100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు.
Similar News
News October 25, 2025
నేడు కలెక్టరేట్‌లో వాహనాలకు నిషేధం

శబ్ద, వాయు కాలుష్య నివారణలో భాగంగా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 25వ తేదీ శనివారం రోజున వాహనాలపై నిషేధం విధించారు. కలెక్టరేట్‌లో పనిచేసే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా కాలినడకన లేదా సైకిల్‌పై విధులకు హాజరు కావాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. ఆ రోజు కలెక్టరేట్ ప్రాంగణంలో ఎటువంటి మోటారు వాహనాలకు ప్రవేశం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
News October 24, 2025
కృష్ణా జిల్లాలో వర్షపాతం వివరాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 46.2 మి.మీల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అత్యధికంగా గూడూరు మండలంలో 89.2 మి.మీల వర్షపాతం నమోదు అవ్వగా అత్యల్పంగా నాగాయలంక మండలంలో 19.6మి.మీల వర్షపాతం నమోదైంది. రానున్న 48 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
News October 24, 2025
కృష్ణా జిల్లా DMHOగా బాధ్యతలు స్వీకరించిన డా. యుగంధర్

కృష్ణాజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి(DMHO)గా డా. యుగంధర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. DMHOగా బాధ్యతలు నిర్వర్తించిన డా. శర్మిష్ట గత నెల పదవీ విరమణ చేయగా ఆమె స్థానంలో యుగంధర్ నియమితులయ్యారు. ఎముకల శస్త్ర చికిత్స నిపుణుడైన యుగంధర్ గతంలో గుడివాడ, అవనిగడ్డలో పని చేశారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా కూడా పని చేశారు. నూతన DMHOను పలువురు ఉద్యోగులు కలిసి అభినందనలు తెలిపారు.


