News June 13, 2024
కృష్ణా జిల్లాలో ఆ నేతను శాసనసభ స్పీకర్ పదవి వరించేనా..?

CBN మంత్రివర్గంలో ఉమ్మడి కృష్ణా నుంచి ఇద్దరికి చోటు దక్కగా కొందరు సీనియర్లకు స్థానం లభించలేదు. అవనిగడ్డ నుంచి 4వ సారి అసెంబ్లీకి ఎన్నికైన మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు కేబినెట్ చోటు దక్కుతుందని ఊహాగానాలు వెలువడ్డాయి. మంత్రివర్గంలో మండలికి చోటు దక్కకపోవడంతో ఆయనకు శాసనసభ స్పీకర్ పదవి దక్కవచ్చని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 17, 2025
కృష్ణా: ‘టెన్త్ పరీక్షలకు యూనిఫామ్ అనుమతి లేదు’

పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ అనుమతి లేదని (గవర్నమెంట్ ఎగ్జామ్స్) అసిస్టెంట్ కమిషనర్ ఎమ్ డేవిడ్ రాజు తెలిపారు. సోమవారం స్వతంత్ర పురం జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఘటనపై యూనిఫామ్ అనుమతి ఉందా, లేదా అన్న విషయంపై (ఎమ్ డేవిడ్ రాజును పాత్రికేయులు వివరణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరీక్షా సమయంలో యూనిఫామ్ అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు.
News March 17, 2025
MTM: పదోతరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. భద్రతను పటిష్టం చేస్తూ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను పటిష్ఠంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థులను జీఎంఎస్‌కేలతో తనిఖీ చేసి అనుమతించాలన్నారు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్‌లను అరికట్టేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
News March 17, 2025
కృష్ణా: నేడు ‘మీకోసం’ కార్యక్రమం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజానీకం, సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులకు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు.