News March 20, 2025

కృష్ణా జిల్లాలో ఇద్దరు ఇన్విజిలేటర్లు సస్పెండ్ 

image

పదో తరగతి పరీక్షల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తాడిగడప ఎంపీపీ ఎస్ మెయిన్ పాఠశాల ఇన్విజిలేటర్‌‌ను డీఈవో రామారావు సస్పెండ్ చేశారు. గైర్హాజరైన విద్యార్థి స్థానంలో మరొకరు పరీక్ష రాయడాన్ని గమనించకుండా బాధ్యతా రహితంగా వ్యవహరించడంతో ఈ చర్య తీసుకున్నారు. కంకిపాడులో ప్రశ్నపత్రం మార్పిడి ఘటనలో మరో ఇన్విజిలేటర్‌ను కూడా సస్పెండ్ చేశారు.

Similar News

News March 31, 2025

కోడూరు: బాలికపై అనుచిత ప్రవర్తన..పోక్సో కేసు నమోదు 

image

కోడూరులో ఓ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వరికూటి వేణు అనే వ్యక్తి, బాలిక ఇంట్లో ఉన్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించగా, భయంతో బాలిక బయటకు పరుగెత్తింది. ఈ విషయాన్ని తల్లికి తెలపడంతో పెద్దలు రంగ ప్రవేశం చేశారు. అయితే, 2 రోజుల పాటు విషయం బయటకు రాకుండా చూసిన పెద్దలు, చివరికి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది. 

News March 31, 2025

కృష్ణా: నేటి ‘మీకోసం’ కార్యక్రమం రద్దు 

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే కార్యక్రమం రద్దయినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే అర్జీ దారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తదుపరి ‘మీకోసం’ కార్యక్రమం వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. 

News March 31, 2025

VJA: పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక విషయాలు

image

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం బెజవాడలో ప్రవీణ్ కేసు విచారణలో సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన రోజు ప్రవీణ్ గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైక్‌తో సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. అదే సమయంలో అతని బైక్ డోమ్ పగిలినట్లు గుర్తించారు. త్వరలో మరిన్ని వివరాలు వివరించనున్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!