News March 17, 2025

కృష్ణా జిల్లాలో పది పరీక్షలకు సర్వం సిద్ధం 

image

నేటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లను విద్యాశాఖాధికారులు పూర్తిచేశారు. జిల్లాలో మొత్తం 145 కేంద్రాల్లో పరీక్షలు జరగనుండగా 22,341 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పరీక్షా కేంద్రాల్లో చేపట్టారు. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా 52 సిట్టింగ్, 05 ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు. 

Similar News

News November 23, 2025

రేపు ఘంటసాలలో ‘రైతన్నా మీ కోసం’

image

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని ఘంటసాల గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నారు. టీడీపీ నేతలు ఆదివారం ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. కనపర్తి శ్రీనివాసరావు శాస్త్రవేత్త డా.డి.సుధారాణితో మాట్లాడి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.

News November 23, 2025

కృష్ణా: బెల్టు షాపులపై ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్.!

image

గ్రామస్థాయిలో బెల్టు షాపు కనిపిస్తే ‘బెల్టుతీస్తా’ అన్న ప్రభుత్వ ఆదేశాలు జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్ షాప్ నిర్వాహకులే నేరుగా మద్యం డోర్ డెలివరీ ప్రారంభించడంతో బెల్టు వ్యాపారం అడ్డదారులు వేస్తూ దూసుకుపోతోందని సమాచారం. ఎక్సైజ్ మంత్రి సొంత జిల్లాలోనే మద్యం ఏరులై పారుతుంటే, ఆ శాఖ అధికారులు ఈ దందాలో భాగస్వాములా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

News November 23, 2025

మచిలీపట్నం: నాన్ వెజ్‌కు రెక్కలు.!

image

కార్తీక మాసం ముగియటంతో జిల్లాలో మాంసపు దుకాణాలు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. నెల రోజులపాటు మాంసాహారానికి దూరంగా ఉన్న ప్రజలు ఆదివారం మార్కెట్‌కు వెళ్లి తమకు ఇష్టమైన మాంసాహారం (చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు) కొనుగోలు చేస్తున్నారు. నెల రోజుల పాటు తగ్గిన మాంసాహారాల ధరలు ఆదివారం ఆమాంతం పెరిగిపోయాయి. కేజీ మటన్ రూ.900, చికెన్ రూ. 220, రొయ్యలు రూ.400ల వరకు అమ్ముతున్నారు.