News March 29, 2025

కృష్ణా: జిల్లాలో పర్యటించిన ఎస్సీ కమిషన్ సభ్యురాలు

image

ఎస్సీలపై పెరుగుతున్న వివక్షను ఖండిస్తూ పెడన ఎస్సీ సంఘాల వారు ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ కమిషన్ సభ్యురాలు మల్లేశ్వరి శుక్రవారం పెడనలో 6వ వార్డును సందర్శించారు. స్థానిక ఎస్సీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వివక్షతకు గురవుతున్న పరిస్థితులపై వివరాలు సేకరించారు. పెడనలో జరుగుతున్న అన్యాయంపై నివేదిక రూపొందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Similar News

News April 3, 2025

పెనమలూరులో వ్యాపారి కిడ్నాప్.. కాపాడిన పోలీసులు

image

పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం హైడ్రామ చోటుచేసుకుంది. పోరంకి నారాయణపురం కాలనికి చెందిన వెంకటేశ్వరరావును, వ్యాపార విభేదాల నేపథ్యంలో భాగస్వామి రాజు తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన ఆయన కుమార్తె పోలీసులకు సమాచారం అందించడంతో, వారు అప్రమత్తమై వెంటనే అతడిని కాపాడి కిడ్నాప్‌కు ముగింపు పలికారు.

News April 3, 2025

క‌ష్ణా జిల్లాలో పర్యటించిన కలెక్టర్ 

image

కృష్ణా జిల్లాలోని పలుమండలాలతో పాడు పెదపారుపూడి మండలం భూషనగుళ్ల, మహేశ్వరపురంలోని బాలురు, బాలికల పాఠశాలలను బుధవారం పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

News April 2, 2025

మచిలీపట్నం: పారిశుద్ధ్య చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టండి – కలెక్టర్

image

మచిలీపట్నం నగరంలో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్లో మున్సిపల్ అధికారులతో సమావేశమైన కలెక్టర్ పారిశుద్ధ్య చర్యలపై చర్చించారు. నగరంలో మార్కెట్ యార్డు, లేడీయాంప్తిల్ కళాశాల, పద్మావతి మహిళా కళాశాల తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సీసీ టీవీలు ఎలా పని చేస్తున్నాయో మొబైల్ ద్వారా కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

error: Content is protected !!