News March 29, 2025
కృష్ణా: జిల్లాలో పర్యటించిన ఎస్సీ కమిషన్ సభ్యురాలు

ఎస్సీలపై పెరుగుతున్న వివక్షను ఖండిస్తూ పెడన ఎస్సీ సంఘాల వారు ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఎస్సీ కమిషన్ సభ్యురాలు మల్లేశ్వరి శుక్రవారం పెడనలో 6వ వార్డును సందర్శించారు. స్థానిక ఎస్సీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వివక్షతకు గురవుతున్న పరిస్థితులపై వివరాలు సేకరించారు. పెడనలో జరుగుతున్న అన్యాయంపై నివేదిక రూపొందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Similar News
News April 17, 2025
కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి. గోపి బాధ్యతలు

కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి. గోపి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న అరుణ సారెక చిత్తూరుకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో విశాఖపట్నం వ్యాట్ కోర్టు అప్పలెట్ జడ్జిగా ఉన్న గోపి నియమితులయ్యారు. నేడు ఆయన జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు.
News April 17, 2025
నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న మంత్రి మనోహర్

మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం పునాదిపాడులో పర్యటించనున్నారు. అనంతరం పెనమలూరు మండలం వణుకూరులోని దాన్యం సేకరణ కేంద్రాలను పరిశీలిస్తారు. ఈ పర్యటనలో మంత్రి వెంట సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, సంభందిత ఆధికారులు పాల్గొంటారు.
News April 17, 2025
నీటి తీరువా పన్నును వసూలు చేయాలి: కలెక్టర్

కృష్ణా జిల్లాలో నీటి తీరువా పన్నును అత్యధిక ప్రాధాన్యతతో వసూలు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలక్టరేట్‌లోని క్యాంపు కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి రెవెన్యూ అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో రూ.32కోట్ల నీటి తీరువా పన్ను వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.9కోట్లు వసూలు చేశారన్నారు.