News February 18, 2025

కృష్ణా జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

image

జిల్లాలో రోజురోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నేటి నుంచే పగటి ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు రాబోతున్నాయని, అనేక ప్రాంతాల్లో 38 డిగ్రీలు నమోదయ్యే సూచనలు కన్పిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నిన్న మచిలీపట్నంలో 33 డిగ్రీలు నమోదు అయినట్లు తెలిపారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News February 22, 2025

పెనమలూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పెనమలూరు పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గంగూరు వద్ద శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి గాయాలతో పడి ఉన్నాడే. సమాచారం అందుకున్న పోలీసేులు అక్కడికి చేరుకొని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ చేశామన్నారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందినట్లు తెలిపారు. ఈ వ్యక్తి తెలిస్తే పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు.

News February 22, 2025

పెడనలో బాలిక మిస్సింగ్.. పోలీసుల గాలింపు

image

తోటమూల ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక అదృశ్యమైన ఘటన పెడన పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు పెడన పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న ఎస్పీ ఆర్. గంగాధర్ పోలీసులను అలర్ట్ చేసి, పెడన సీఐ పర్యవేక్షణలో 4 పోలీసు బృందాలతో బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

News February 22, 2025

మచిలీపట్నం: జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం 

image

వాహన చోదకులు హెల్మెట్, సీట్ బెల్టు ధరిస్తే చాలావరకు రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని కలెక్టర్ బాలాజీ అన్నారు. శుక్రవారం మచిలీపట్నం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ కేసులు, రహదారులపై బ్లాక్ స్పాట్లకు తీసుకున్న చర్యలు, రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలపై చర్చించారు. 

error: Content is protected !!