News August 23, 2024

కృష్ణా జిల్లాలో ప్రారంభమైన గ్రామసభలు

image

మహాత్మ గాంధి జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టబోయే పనులపై కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. బందరు మండలం భోగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొనగా బంటుమిల్లిలో జరిగిన గ్రామసభలో కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు గ్రామసభల్లో పాల్గొన్నారు.

Similar News

News January 3, 2026

గుడివాడ ఫ్లైఓవర్‌కు రైల్వే అనుమతులు.. కానీ.!

image

గుడివాడలోని రైల్వేగేట్లపై రూ.330కోట్లతో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ల పనులకు అనుమతులు లభించాయి. ఇప్పటికే 70% పనులు పూర్తి కాగా, భూసేకరణ చెల్లింపులు తుది దశకు చేరుకున్నాయి. మిగిలిన పనులను రైల్వే అధికారులు నేరుగా పర్యవేక్షించాల్సి ఉంది. సాంకేతిక అనుమతుల ప్రక్రియ దృష్ట్యా ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మరో 6నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరికి ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

News January 2, 2026

పెడన: యువకుడి సూసైడ్

image

పెడన మండలం చెన్నూరు గ్రామంలో యర్రంశెట్టి వెంకటేష్‌ (28) తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. పెడన ఎస్‌ఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి విచారణ చేపట్టారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 2, 2026

కృష్ణా జిల్లా కలెక్టర్‌ను ప్రశంసించిన చంద్రబాబు

image

కలెక్టర్ డీకే బాలాజీని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలను విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మలిచిన తీరు అభినందనీయమన్నారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు వినూత్న ఆలోచనలతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.