News March 2, 2025
కృష్ణా జిల్లాలో మండుతున్న ఎండలు

కృష్ణా జిల్లాలో ఆదివారం ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గుడివాడ 38°, బాపులపాడు 38°, గన్నవరం 38°, బందరు 34°, పెనమలూరు 37°, పామర్రు 34°, అవనిగడ్డ 32 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పలుచోట్ల పిల్లలు ఎండలను సైతం లెక్కచేయకుండా ఆటలాడుతున్నారు.
Similar News
News March 24, 2025
MTM: పెండింగ్ అర్జీలను పరిష్కరించాలి – కలెక్టర్

మీకోసం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇప్పటి వరకు 19,839 అర్జీలు అందగా అందులో ఇంకా 2,235 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని సత్వరం పరిష్కరించాలన్నారు.
News March 24, 2025
కృష్ణాజిల్లాలో పదో తరగతి గణితం పరీక్ష ప్రశాంతం

కృష్ణాజిల్లా వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన పదో తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈఓ పీవీజే రామారావు తెలిపారు. జిల్లాలో 21,771 మంది విద్యార్థులకు గాను 21,419 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారన్నారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు. విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.
News March 24, 2025
తాడేపల్లిలో పామర్రు మహిళ దారుణ హత్య

ఎన్టీఆర్ జిల్లా తాడేపల్లి కొలనుకొండ వద్ద ఆదివారం రాత్రి నిర్మానుష్య ప్రాంతంలో వివాహిత దారుణ హత్యకు గురైన విషయం తెలిసినదే. మృతురాలు కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన సజ్జా లక్ష్మీ తిరుపతమ్మగా పోలీసులు గుర్తించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త మృతి చెందడంతో కుటుంబ పోషణ భారమై క్యాటరింగ్ పనులకు వెళ్తోంది. లక్షీ తిరుపతమ్మ ఆదివారం విజయవాడలో క్యాటరింగ్ పనికి వెళ్తున్న క్రమంలో హత్యకు గురైంది.